calender_icon.png 12 February, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిఏ కొరడా.. 10 బస్సులు సీజ్

12-02-2025 12:13:48 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 11: ప్రైవేటు బస్సులపై ఆర్టిఏ అధికారులు కొరడా ఝలిపించారు. 

రాజేంద్రనగర్ లోని ఆరంఘర్, శంషాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు.  తెలంగాణ రాష్ట్ర టాక్స్ కట్టకుండా చెలామణీ అవుతున్న ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా పై ఆర్టిఏ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో 10 ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.

తెలంగాణ బార్డర్ లో అధికారుల కళ్లు గప్పి నగరానికి వచ్చిన పలు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్స్ రూపంలో గండి కొడుతున్న యజమానుల తాట తీసి 10 బస్సులు సీజ్ చేసి సీజింగ్ యార్డ్ కు తరలించారు. నవంబర్ ట్రావెల్స్, సుగుణ ట్రావెల్స్, ఎస్‌ఆర్టీ ట్రావెల్స్, వినాయక ట్రావెల్స్, సాయి దుర్గా ట్రావెల్స్, ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్, అనంత ట్రావెల్స్ కు చెందిన బస్సులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.