- పర్యవేక్షణ లోపం వల్లే అనేక ప్రమాదాలు
ఆర్టీఏ ఏజెంట్ల కనుసైగల్లో పనిచేస్తున్న ధికారులు
కల్వకుర్తి, జనవరి 6: గత కొంత కాలంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధి రోడ్డు ప్రమా దాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండ అనేక మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఆర్టిఏ అధికారులేనని నియోజకవర్గ ప్రజలు, వాహన దారులు మండిపడుతున్నారు. తాజాగా చారకొండ మండల పరిధిలో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపం, డ్రైవర్ నిర్లక్ష్యమని తెలుస్తోంది.
కల్వకుర్తి ఆర్టిఏ ఆఫీస్‌లో ఏజెంట్‌లదే ఇష్టా రాజ్యంగా నడుస్తోందని ఎలాంటి టెస్ట్ డ్రైవ్ లేకుండా హెవీ లైసెన్స్ లో ఇచ్చే స్థాయిలో ఏజెంట్లు అధికారులను మేనేజర్ చేస్తున్నారని అనేక విమర్శలు వస్తున్నాయి. సంతకాలకే పరిమి తమైన అధికారికి వత్తాసు పలుకుతూ చాలా కాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అనే గుసగుసలు వినిపిస్తున్నా యి.
అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల మరిం త మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని విమర్శలు వస్తున్నాయి. కొన్ని వాహనాలు పరిమితికి మించి బరువుతో ప్రయాణిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరి స్తున్నారని తద్వారా తరచూ రోడ్డు ప్రమాదా లతో పాటు రోడ్లు త్వరగా దెబ్బతింటు న్నాయని మండిపడుతున్నారు.
గత కొంత కాలంగా చీకటి వ్యాపారంగా కలప, మైనింగ్, రేషన్ అన్నింటిలో అధిక లోడుతో పరిమి తికి మించి రవాణా జరుగుతున్నప్పటికి నామమాత్రపు తనిఖీలు జరిపి వసూళ్లకు తెగబడుతున్నారని ఆర్టిఏ అధికారులపై విమ ర్శలు వస్తున్నాయి. వీరి సహకారంతోనే అక్రమార్కులు విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగిస్తూ రోడ్డు నిబంధనలను తుంగలో తొక్కి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతు న్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్లకే పరిమితమైన పోలీసు శాఖ నిద్రమత్తు మేల్కొవాలని చెప్తున్నారు. ఇప్పటికైనా అటు పోలీసులు ఇటు రవాణా శాఖ అధికారులు అక్రమ వసూళ్లు, నిద్ర మత్తు విడి అప్రమత్తతో ఉండి ప్రజల ప్రా ణాలు కాపాడుతూ వారి విధులు సక్రమం గా నిర్వహించాలని పట్టణవాసులు, ప్రజలు కోరుకుంటున్నారు.