calender_icon.png 7 February, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనస్థలిపురంలో ఆర్టీఏ తనిఖీలు

07-02-2025 11:09:52 AM

10 ఓమ్ని వ్యాన్ల ను సీజ్ చేసిన అధికారులు

ఎల్బీనగర్,(విజయక్రాంతి): హయత్ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School) విద్యార్థిని వ్యాన్ కింద పడి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు(RTA officials) అప్రమత్తమయ్యారు. శుక్రవారం వనస్థలిపురం(Vanasthalipuram) ప్రాంతంలో ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న సుమారు 10 ఓమ్ని వాహనాలను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. స్కూల్ నిర్వాహకులే విద్యార్థులను తరలించే ప్రైవేటు వాహనాల ఫిట్ నెస్ బాధ్యత వహించాలని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు.