20-04-2025 12:40:04 AM
రూ.7.75లక్షలకు ఫ్యాన్సీ నంబర్ సొంతం చేసుకున్న సినీనటుడు బాలకృష్ణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఆర్టీఏకు శనివారం రూ.37.15 లక్షల ఆదాయం వచ్చింది. టీజీ 09ఎఫ్ 0001 అనే నంబర్ సినీనటుడు నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు సొంతం చేసుకున్నారు.
టీజీ 09ఎఫ్ 0009 అనే నంబర్‌ను కమలాలయ హిసాఫ్ట్ ప్రై.లి. సంస్థ రూ.6.70 లక్షలకు సొంతం చేసుకుంది. టీజీ 09 ఈ 9999 అనే నంబర్‌ను ఈకో డిజైన్ స్టూడియో రూ.99,999 లకు దక్కించుకుంది. టీజీ 09 ఎఫ్ 0005 అనే నంబర్‌ను జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రై.లి. అనే సంస్థ రూ.1,49,999 లకు కైవసం చేసుకుంది.
టీజీ 09ఎఫ్ 0007 నంబర్‌ను రూ.1,37,779లకు కె.శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి దక్కించుకున్నారు. టీజీ 09ఎఫ్ 0019 అనే నంబర్‌ను నేత్రావతి బీబీయూ బాలగప్ప శివలింగప్ప రూ.60వేలకు సొంతం చేసుకున్నా రు. టీజీ 09ఎఫ్ 0099 నంబర్‌ను కాన్‌కాప్ ఎలక్ట్రికల్ ప్రై.లి. సంస్థ రూ.4,75,999లకు దక్కించుకున్నారు.