రాజేంద్రనగర్, జనవరి 16: ఆర్టీఏ అధికారులు శంషాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ముమ్మరంగా తనిఖీ చేశారు. మోటార్ వాహన చట్టానికి తూట్లు పొడుస్తున్న బస్సుల పై కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం తనిఖీలు చేసిన అధికారులు ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ వస్తున్న బస్సుల పై ప్రధా నంగా దృష్టి సారించారు.
ఈ నేప థ్యంలో కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకు మారి, కర్ణాటక, బెంగుళూరు, ఆంధ్ర ప్రదేశ్, గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సులు తనిఖీలు చేశారు. తెలంగాణ ట్యాక్స్ కట్టని బస్సులపై కొరడా ఝాలిపిం చారు. నిబంధనలకు విరుద్ధంగా లగేజీ తరలించే వాటిపై అధికారులు దృష్టి సారించారు. మొత్తం 16 బస్సు ల పై కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని నిర్వాహ కులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు.