calender_icon.png 11 January, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ దాడులు

11-01-2025 01:32:01 PM

160 బస్సులపై కేసు నమోదు

ఆరంజ్ బస్సు సీజ్  

రాజేంద్రనగర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు(RTA officials) కొరడా ఝలుపించారు. శనివారం ఉదయం రాజేంద్రనగర్ లోని ఆరంగర్ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి తో పాటు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను ఆపి తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల(private travel buses)పై కేసులు నమోదు చేశారు. రాజేంద్రనగర్ వద్ద 11 బస్సులపై కేసు నమోదు చేసినట్లు ఆర్టిఏ అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా ఆరెంజ్ బస్సు(Orange bus Seize )ను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆర్టిఏ   అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 160 బస్సులపై కేసులు నమోదు చేశారు అదేవిధంగా 16 బస్సులను సీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పై మూడు రోజులుగా ఆర్టిఏ  అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు రంగారెడ్డి జిల్లా ఆర్టిఏ ఉప రవాణా అధికారి సదానందం వెల్లడించారు. నిబంధనలో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. దీంతోపాటు పర్మిట్కు మించి ప్రయాణికులను అదనంగా తరలిస్తే ఊరుకునేది లేదన్నారు.