calender_icon.png 22 February, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్‌యూ చైతన్యం వర్తమానాన్ని నడిపిస్తోంది

22-02-2025 12:00:00 AM

50 ఏళ్ల విప్లవ విద్యార్థి సంఘం సదస్సులో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): ప్రస్తుతం ఆర్‌ఎస్‌యూ లేకున్నా.. అది అందించిన చైతన్యం వర్తమానాన్ని నడిపిస్తోందని విప్లవ విద్యార్థి సంఘం మాజీ నాయకులు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ౫0 ఏళ్ల విప్లవ విద్యార్థి సంఘం సదస్సులో వారు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

సంఘం మాజీ నాయకుడు పాణి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌యూ తన కార్యాచరణతో అద్భుతమైన మేధావులు, రచయితలను అందించిందని. కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట విప్లవోద్యమాన్ని నిర్మూలించాలని భావిస్తుందని పేర్కొన్నారు.