calender_icon.png 10 October, 2024 | 3:02 PM

బీజేపీని గెలిపించిన ఆరెస్సెస్

10-10-2024 01:12:37 AM

హర్యానా గెలుపులో సంఘ్‌దే కీలక పాత్ర

ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించిన సంఘీలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో ఎక్కడైనా బలపడాలని బీజేపీ నిర్ణయించిందంటే.. మరుక్షణం ఆరెస్సెస్ వాలిపోతుంది. చడీ చప్పుడు కాకుండా తన భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పిస్తుంది. అందుకోసం ఏండ్లపాటు సమయం పట్టినా ఓపిగ్గా పనిచేస్తుంది.

ఏం చేసైనా బీజేపీకి పునాది సిద్ధం చేస్తుంది. ఇప్పటికే బీజేపీ అధికారం ఉన్నచోట మరిం త స్వేచ్ఛగా పనిచేస్తూ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత మొగ్గ తొడగకుంటా జాగ్రత్తగా నిర్మూ లిస్తుంది. హర్యానాలోనూ సంఘ్ అదే పనిచేసిందని, అందుకే బీజేపీ రికార్డు స్థాయిలో హ్యాట్రిక్ సాధించిందని చెప్తున్నారు. హర్యానాలో పదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న ది.

దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. దానికి తోడు రాష్ట్రానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారులు, రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష వైఖరితో ఆయావర్గాల్లో తీవ్రఆగ్రహం ఉన్న ది. 17 ఎస్సీ నిజర్వుడు అసెంబ్లీ స్థానాలున్నాయి.

అంటే పార్టీల గెలుపు ఓటములను నిర్ణయించటంలో ఎస్సీలకు చాలా ప్రాధా న్యం ఉన్నది. జాట్ల ఆధిపత్యాన్ని ఇతర వర్గాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇన్ని సమస్యలున్నా బీజేపీ విజయం సాధించటం వెనుక సంఘ్ శ్రమ ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. 

పక్కా ప్లాన్‌తో

గత లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ 5 లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. ఆ పార్టీకి ఓట్ల శాతం కూడా తగ్గింది. సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ పాలనలో పార్టీపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోయిందని ఆరెస్సెస్ గత ఆగస్టులో నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది.

అదే విషయాన్ని బీజేపీ అధిష్ఠానానికి చేరవేయగా, అసెంబ్లీ ఎన్నికల్లో సాయం కావాలని పార్టీ హైకమాండ్ ఆరెస్సెస్ పెద్దలను కోరినట్లు సమాచారం. గత జూలై 29న ఆరెస్సెస్ సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్, బీజేపీ హర్యానా శాఖ అధ్యక్షుడు మోహన్‌లాల్ బర్దోలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమై హర్యానాలో పార్టీపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలన్న అంశంపై చర్చించారు.

యువత, రైతులు, నిరుద్యోగులు, పేదలు, గ్రామీణ ప్రాంత వాసులను ఆకట్టుకొనేందుకు ప్రత్యే క పథకాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కొత్తగా సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఆ పథకాలను ఒక్కొక్కటిగా ప్రవేశపెడుతుండగా, వాటిని సంఘ్ శ్రేణులు ఆయా వర్గా ల్లోకి బలంగా తీసుకుపోవటం మొదలుపెట్టాయి.

అందుకోసం ఆరెస్సెస్ ఒక్కో జిల్లాకు 150 మంది వాలంటీర్లను నియమించింది. ఇందుకోసం సెప్టెంబర్ ప్రారంభంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఎన్నికలు సమీపించగానే అభ్యర్థుల ఎంపిక లోనూ ఆరెస్సెస్ కీలక పాత్ర పోషించింది. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న నేతలకే టికెట్లు ఇచ్చేలా బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించింది.