calender_icon.png 13 January, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్‌లోనే ఆర్‌ఎస్పీ కుట్ర

01-12-2024 12:18:11 AM

  1. నాణ్యమైన భోజనం పెడుతుంటే ఓర్చుకోవడం లేదు 
  2. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన మనుషులతో గురుకులాలపై కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. తమ ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంచి నాణ్యమైన భోజం అందింస్తుంటే ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్చుకోవడం లేదని  విమర్శించారు.

శనివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  బీఆర్‌ఎస్ పాలనలో ఒకసారి కూడా డైట్ చార్జీలను పెంచకున్నా ఆర్‌ఎస్ నోరు మెదపలేదని నిలదీశారు. స్వేరో వంటి ప్రయివేట్ సైన్యాన్ని తయారు చేశారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విషయంలో ఆర్‌ఎస్ నీచానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.  సీఎం రేవంత్‌రెడ్డిపై పింక్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.