న్యూఢిల్లీ, నవంబర్ 9: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ ఇం డియా ఎలక్ట్రానిక్స్ ఆదాయం 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం 3 శాతం వృద్ధితో రూ. 99,451 కోట్లకు చేరిందని, నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ. 8,188 కోట్లకు చేరిందని బిజినెస్ ఇంటిలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వెల్లడించింది. ఇతర ఆదాయంతో కలుపుకొని కంపెనీ మొత్తం ఆదాయం లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించి రూ. 1,02,628 కోట్లకు చేరింది. 2023 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో శాంసంగ్ ఇండియా రూ. 96,632 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,450 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.