గురుకుల బాటతో కాంగ్రెస్ కు భయం పట్టుకుంది.
కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... కేటీఆర్, గురుకుల బాట అనే కార్యక్రమాన్ని చేపట్టారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. గురుకుల బాట అని చెప్పగానే.. కాంగ్రెస్ కు భయం పుట్టిందన్నారు. నిన్న మంత్రి కొండా సురేఖ తనపై ఆరోపణలు చేశారని చెప్పిన ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారని స్పష్టం చేశారు. మహిళలపై చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని తెలిపారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది.. ఏడేళ్ల సర్వీస్ ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.