calender_icon.png 25 February, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వలసవాది

25-02-2025 12:16:44 AM

నేను పుట్టింది ఇక్కడే.. చచ్చేది ఇక్కడే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కాగజ్‌నగర్, ఫిబ్రవరి 24 : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రాంతానికి వచ్చిన అసలైన వలసవాది అని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం పట్టణంలోని రాయల్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పుట్టింది ఇక్కడే చచ్చేది కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు. తను పార్టీ మారుతున్నట్లు కొంతమంది ప్రచారాలు చేస్తూ పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారన్నారు.

అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనపై అనేక తబండాలు వేస్తూ ఆరోపణలు చేస్తూ అవాకులు చివాకులు పెడుతున్నారని ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

తనను వలసవాది అంటున్న ఆర్‌ఎస్పి ది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చి ఓడిపోగానే మళ్లీ వేరే చోటకు వెళ్లి అక్కడ పోటీ చేసి డిపాజిట్ కూడా రాకపోవడంతో మళ్లీ ఇక్కడికి చేరి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.