calender_icon.png 30 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్

30-11-2024 01:14:48 AM

  1. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే కుట్రలు
  2. ఘటనలపై సమగ్ర విచారణ జరిపిస్తున్నాం
  3. కవిత, హరీశ్ ఏకమై కేటీఆర్‌ను పక్కన బెడుతున్నారు
  4. టైం వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్ అరెస్టు అవుతారు
  5. మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఇటీవల వసతి గృహాల్లో వెలుగు చూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హస్తం ఉందని  మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులతో గురుకు లాల్లో సైకోరావు(కేటీఆర్) కుట్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని వివరించారు. కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ర్టంలో ఐదేండ్లు సీఎం రేవంత్‌రెడ్డి పాలనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో కవి త, హరీశ్ ఏకమై కేటీఆర్‌ని పక్కనబెడుతున్నారని, కేటీఆర్‌తో పార్టీకి నష్టం జరుగుతు న్నదనే భావనలో కేసీఆర్ ఉన్నారని చెప్పా రు.

శుక్రవారం సచివాలయంలో మీడియా తో మంత్రి సురేఖ మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకుపోవడంతో కేటీఆర్ పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారని విమర్శించా రు. ప్రజాపాలనపై బురద జల్లేందుకే  లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డా రు. ప్రభుత్వం మంచి చేస్తుంటే కేటీఆర్ తన పెయిడ్ సోషల్ మీడియాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా కుటిల యత్నాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాంకిడి ఘటనలో చనిపోయిన విద్యార్థి శైలజ మర ణం బాధాకరమని, బాలిక కుటుంబానికి రూ. రెండు లక్షల పరిహారం, ఒక ఇందిరమ్మ ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని వెల్లడించారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉప యోగించుకోవాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో ఒక్కరినినైనా ఆదుకుని బాధిత కుటుంబాల కు అండగా నిలిచారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబాని కి కోటి రూపాయలు ఇవ్వాలని సూచించా రు.

వాంకిడి  ఘటన జరిగిన వెంటనే తాము స్పందించామని,  తనతోపాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ బాధిత కుటుంబాన్ని పరామర్శించామని, ఘటనకు బాధ్యులైన అధికారులను కూడా సస్పెండ్ చేశామన్నారు. ఫుడ్ పాయిజన్‌పై  విచారణ చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

గురుకులాల్లో ఆర్‌ఎస్ దోపిడీ..

లగచర్లలో కలెక్టరును మర్డర్ చేసేందుకు కుట్రలు చేశారని,సైకోరావు ఈ రకంగా చేయడం సిగ్గు చేటన్నారు. కవిత జైలులో ఉన్నన్ని రోజులు కేటీఆర్ మంచిగానే ఉన్నారని, కానీ బయట వచ్చిన నాటి నుంచి ఆయనలో భయం పట్టుకుందని మంత్రి చె ప్పారు. కవిత, హరీశ్ ఒక్కటయ్యారనే భయంతోపాటు కేసీఆర్ కూడా కవితకే ప్రాధాన్యత ఇవ్వడంతో కేటీఆర్ ఆందోళన పడుతున్నారని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని పేర్కొన్నా రు. గతంలో ఆయనపై బాల్క సుమన్, గ్యాద రి కిషోర్ అసెంబ్లీలోనే ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. రూ.99 కోట్ల టెండర్లు ప్రభు త్వ అనుమతి లేకుండా ఖర్చు చేశారని, అందులో భారీగా అవకతవకలు జరిగాయ న్నారు.

103 గురుకుల పాఠశాలల భవనా లు బీఆర్‌ఎస్ నేతల బంధువుల బిల్డింగ్‌లో నడిచాయని, వాటికి సంబంధించిన కమీష న్ ఎవరి జేబులోకి వెళ్లిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రవీణ్ కుమార్, తన అనుచర గణం లక్షలు వసూలు చేసి, గురుకులాల్లో నియామకాలు, టెండర్లు చేశారని ఆరోపించారు.

దళిత ఓటర్లను తన వైపునకు తిప్పు కొని, కాంగ్రెస్‌కు దూరం చేసేందుకు ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి పోటీ చేసి, ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారని విమర్శించా రు. ఇప్పుడు గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ప్రచారం వెనుక ఆయన హస్తం ఉందని ఆరోపించారు. గతంలో గురుకులాలను ఒక మాఫియా లాగా నడిపారని విమర్శించారు.

అన్ని గురుకులాల్లో నూ ఆయన అనుచరులు ఉన్నారని, కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్‌ను పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్ఫడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. దీనిపై లోతుల్లోకి వెళ్లి ఆరా తీస్తున్నామన్నారు. ఇక తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పెయిడ్ సోషల్  మీడియా వారి ఇళ్లలో ఆడవారు లేరా అని ప్రశ్నించారు.

విదేశాల నుంచి కొందరు బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా సోషల్ మీడియాను నడుపుతూ పోస్టులు పెడుతున్నారని,  ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నార ని, అలాంటి వారిపై కచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇంకా నాలుగేండ్లు తమకు అవకాశం ఉందని, తాము ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.

కేటీఆర్‌ను అరెస్టు చేసే రోజు వస్తుంది

 సమయం వచ్చినప్పుడు ఆయన చెల్లె కవిత అరెస్ట్ అయిందని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. సమయం వస్తే కేటీఆర్, కేసీఆర్‌కు కూడా అరెస్టు అవుతారని చెప్పారు. కేటీఆర్‌కు పిచ్చి ముదిరిందని, మంచి సైక్రియాట్రిస్ట్‌కు చూపించుకోవాలని సలహానిచ్చారు. కలెక్టర్‌ను ఉరికించి కొడతామని, బట్టలు ఊడదీసి కొడతామని కేటీఆర్ అనడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుందని, అన్ని కుట్రలు బయటకు వస్తాయని చెప్పారు. తప్పులు చేశానని ఆయనకు తెలుసని, అందుకే జైలుకు పోతానని కలువరిస్తున్నారని, ఆయనకు నిద్రలో కూడా జైలే గుర్తుకొస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.

అధికారంలో ఉండగా కేటీఆర్ ఏనాడూ ప్రజలను కలువలేదని, ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోగానే కేటీఆర్ ఎముకలు విరిగినట్లు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.