calender_icon.png 24 December, 2024 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా

07-11-2024 12:10:40 AM

బొమ్మన్ దేవుపల్లి గ్రామస్థుల నిర్ణయం 

కామారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): గ్రామంలో మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధించాలని బుధవారం కామారెడ్డి జిల్లా బొమ్మన్ దేవ్‌పల్లిలో గ్రామస్థులు తీర్మానం చేశారు. మద్యం అమ్మకాలు చేపట్టడంతో యువత మద్యానికి అలవాటు పడి గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెప్పారు.

దీంతో మద్యం అమ్మకాలు చేపట్టకుండా తీర్మానం చేశారు. ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని పలు గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.