calender_icon.png 20 March, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహన అద్దెకు రూ.61 లక్షలు?

20-03-2025 01:36:25 AM

స్మితా సబర్వాల్‌కు నోటీసులిస్తాం: జయశంకర్ యూనివర్సిటీ 

రాజేంద్రనగర్, మార్చి 19: రాజేంద్రనగర్‌లోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. యూనివర్సిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద ఆమె రూ.61 లక్షలు తీసుకున్నారు.

దీనిపై ఆడిట్ అధిటకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు ఆ మెకు రెండు, మూడు రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. స్మి తా సబర్వాల్ సీఎంవో అదనపు కార్యదర్శిగా ఉన్నప్పుడు వాహనం అలవెన్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది నాన్ టాక్స్ కాదు. అదేవిధంగా ఎల్లో టాక్సీ కాదని అధికారుల విచారణలో తేలింది.

ఇది పవన్‌కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. 2016 నుంచి 2024 వరకు దాదాపు 90 నెలలపాటు నెలకు రూ.63,000 చొప్పున అలవెన్స్ తీసుకున్నట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఈ పరిణామాలను యూనివర్సిటీ బోర్డు మీటింగ్‌లో అధికారులు చర్చించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వా నికి రెండు, మూడు రోజుల్లో పూర్తి నివేదికను ఇవ్వనున్నట్టు యూనివర్సిటీ వీసీ అల్దా న్ జానయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయంశంగా మారింది.