మంత్రి జూపల్లి కృష్ణారావు
రంగారెడ్డి, డిసెంబర్ 4(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఆమనగల్లు మండల కేంద్రంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా పదవులను చేపట్టే పాలకవర్గ సభ్యులు తమ పదవులకు వన్నె తేవాలని.. పాలకవర్గం సభ్యులంతా కరీంనగర్ జిల్లా ముల్కనూర్ రైతు సొసైటీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని, ఒకే విడుతలో 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు.