calender_icon.png 26 November, 2024 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సైబర్’ బాధితులకు రూ.48 లక్షల రీఫండ్

26-11-2024 04:16:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి డబ్బు కోల్పోయిన బాధితులకు రూ. 48.44 లక్షలు రీఫండ్ చేసిన ట్లు సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపారు. మొత్తం ఐదుగురు బాధితులను స్కామర్లు వివిధ రకాలు గా మోసగించి డబ్బు కాజేసినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఆధారంగా నిందితుల బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశా రు. సోమవారం కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు రీఫండ్ చేసినట్లు డీసీపీ  వెల్లడించారు.