వనపర్తి జిల్లాలో 155 మందికి రూ.48.74లక్షలు
వనపర్తి, నవంబర్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు రూ.500 బోనస్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 155 మంది రైతుల ఖాతాల్లో రూ.48 లక్షల 74వేలు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 312 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 5,473 మంది రైతుల నుంచి సన్న రకానికి సంబంధించి 18,273 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అందులో 155 మంది రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను ప్రభుత్వం జమ చేసింది.
ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు వనపర్తి జిల్లా వ్యాప్తంగా రైతులకు వారి ఖాతాల్లో నగదును అధికారులు జమ చేశారు. మరో మూడు రోజుల తర్వాత మిగిలిన రైతులకు సంబంధించి బోసన్ జమ చేస్తాం.