calender_icon.png 13 January, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు

04-12-2024 03:19:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభు త్వం హైడ్రాకు భారీగా నిధులు విడుదల చేసింది. హైడ్రా కార్యాలయం నిర్వహణ, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నగరంలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, పార్కుల స్థలాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో నగరంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలను హైడ్రా అడ్డుకుంటున్న విషయం తెలసిందే.