15-03-2025 12:09:38 AM
టాస్మాక్‌లో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఈడీ
చెన్నై, మార్చి 14: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(టాస్మాక్)లో రూ.1000కోట్ల స్కాం జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రక టా స్మాక్‌కు లిక్కర్‌ను సరఫరా చేసే డిస్టిలరీ లు, బాటిల్ తయారీ కంపెనీలతో కలసి రూ. 1000కోట్లు స్వాహా చేశాయని ప్రకటనలో పేర్కొంది. లాభాల కోసం టాస్మాక్ నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు పొందడానికి ఈ మొత్తాన్ని టాస్మాక్‌లో పని చేసే అధికారుల కు చెల్లించిన స్పష్ట ం చేసింది.
మద్యం త యారీదారుల నుంచి టా స్మాక్ ఉద్యోగులు ముడుపులు అందు కున్న ఆరోపణలు రావడంతో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్‌యాంటీ కరప్షన్ వి భాగం కొందరు అధికారులపై పలు ఎఫ్‌ఐ ఆర్‌లు నమోదు చేసి ంది.
ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ దర్యా ప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే మార్చి 6 నుంచి నాలుగు రోజులపాటు టాస్మాక్ ప్ర ధాన కార్యాల యం, మద్యం తయారీ సం స్థల డిపోలు, కార్పొరేట్ కార్యాలయాల్లో సో దాలు నిర్వహించింది.
మద్యం రవాణా, బార్ లై సెన్స్ టెండర్లు, కొన్ని మద్యం త యారీ సం స్థలకు అనుకూలంగా ఇండెంట్ ఆర్డర్లు, టా స్మాక్ అవుట్‌లెట్లలో బాటిల్‌కు రూ.10 30 అదనంగా వసూలు చేయడం, టాస్మాక్ అధికారుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు సోదాల్లో బయటపడ్డట్టు వివరించింది.