21-02-2025 01:14:40 AM
స్టాండింగ్ కమిటీలో 21 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలోని 6 జోన్ల కు ఒక్కో జోన్‌కు రూ.25 కోట్లు కేటాయించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన ఆస్తుల వివరాలు, వాటి ద్వారా పొందుతున్న ఆదాయం వివరాలను అందజేయాల ని ఎస్టేట్ విభా అడిషనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్‌ను ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ కా మేయర్ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమా రహదారుల విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లుఓవర్స్ నిర్మాణాలకు సంబంధించి ప్రభు అనుమతి కోరుతూ జీహెచ్‌ఎంసీ ద్వారా ప్రభుత్వ ఆమోదానికి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదించినట్టు మేయర్ తెలిపారు. సమావేశంలో 15 అంశాలు, 6 టేబుల్ ఐట సభ్యులు ఆమోదించినట్టు తెలిపారు.
కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ, జంక్షన్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రతి జోన్‌కు రూ.25 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.