హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 338కోట్లను విడుదల చేసింది. జన గాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, భువనగిరిలో ఏర్పాటు చేయనున్న నర్సింగ్ కళాశాలకు ఒక్కో దానికి రూ.26కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నర్సింగ్ కళాశాల్లో ఇప్పటికే మొదటి సంవత్సరంలో 60 మంది విద్యార్థుల చొప్పున అడ్మిషన్ ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. ఈ కళాశాలల నిర్మాణం పూర్తయ్యే వరకు వాటిని పలు ప్రైవేట్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహించనున్నారు.