19-03-2025 01:49:24 AM
తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి
పటాన్ చెరు, మార్చి 18 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు ఎల్ ఆర్ ఎస్ ద్వారా రూ.13 కోట్లు వసూలైనట్లు మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. 6657 ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారుల్లో 526 మంది ఇరవై ఐదు శాతం రాయితీతో చెల్లింపులు చేయగా ఇప్పటి వరకు సుమారు రూ.13కోట్ల పైచిలుకు వసూలు అయ్యాయని చెప్పారు.
ఇంకా 6109 దరఖాస్తుల ఎల్ ఆర్ ఎస్ చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈనెల 31 లోపు మిగతవారు ఇరవై ఐదు శాతం రాయితీతో ఎల్ ఆర్ ఎస్ చెల్లింపులు చేయాలన్నారు. దరఖాస్తుదారులకు పదిమంది కార్యాలయ సిబ్బంది పోన్ లు చేస్తున్నారని ఆయన చెప్పారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆసుపత్రి, అంగన్ వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయని కమిషనర్ సంగారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో వీటిని ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నారు. రెండు డబుల్ బెడ్ రూం ల వద్ద ఈ సదుపాయాలు సమకూరాయన్నారు.