calender_icon.png 1 April, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్ బ్రదర్స్ పార్కింగ్ ఫికర్?

31-03-2025 12:56:11 AM

కేపీహెచ్‌బీ కాలనీ సర్వీస్ రోడ్డులో వాహనదారుల నరకయాతన

ఓ వైపు చిరువ్యాపారులు, మరోవైపు షాపింగ్‌మాల్స్ 

మాల్ ఎదుట కార్ల పార్కింగ్‌తో ఇక్కట్లు

అక్రమ పార్కింగ్‌తో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు

పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు

కూకట్‌పల్లి, మార్చి 30 (విజయక్రాంతి): నగరంలోని కూకట్‌పల్లి అంటేనే ట్రాఫిక్ బెంబేలెత్తిస్తుంది.. ఇరుకైన  రోడ్లపై నిత్యం  వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి.  అయితే కొన్ని వ్యాపార సంస్థలు ధనార్జన ధ్యేయంగా  వినియోగదారుల సౌకర్యాల కల్పనను పట్టించుకో వడం లేదు.

అందులో స్థానికంగా ఉన్న ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఒకటి. కేపీహెచ్‌బీ కాలనీ సర్వీస్ రోడ్‌లో ఉన్న ఈ షాపింగ్ మాల్‌లో సెల్లార్ ఉన్నప్పటికీ కొన్ని ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు మాత్రమే అవకాశం ఉండటంతో  కార్లను సర్వీస్ రోడ్లపైన పార్క్ చేస్తున్నారు. అసలే ఇరుకైన సర్వీస్ రోడ్డు.. దీని వెంబడి  చిరువ్యాపారస్తులు ఒకవైపు ఉంటే మరోవైపు  షాపింగ్‌మాల్స్ ఉన్నాయి. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. 

వీటికి తోడు రోడ్డుకు ఇరువైపులా ఇష్టారాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో మరింత  రద్దీ ఏర్పడుతోంది.  వాహనాల పార్కింగ్‌తో ప్రయాణి కులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేయడంతో రోడ్డు ఇరుకుగా మారి ఎదురుగా వాహనం వస్తే మరో వాహనం వెళ్లేందుకు వీలులేని పరిస్థితి. ఇష్టారాజ్యంగా అంతర్గత రహదారులు, షాపింగ్‌మాల్ ముందు వాహనాలు పార్కింగ్ చేస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

ధనార్జనే ధ్యేయం..

బహుళ అంతస్తులు నిర్మాణం చేపట్టినప్పటికీ కనీసం పార్కింగ్ సౌకర్యం కల్పిం చకుండా వ్యాపార సముదాయాలు ధనార్జన ధ్యేయంగా తమ వ్యాపారాన్ని కొనసా గిస్తున్నారు. ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో సెల్లార్ ఉన్నప్పటికీ ఇరుకుగా ఉండటంతో షాపింగ్‌కు వచ్చే కొనుగోలుదారుల వాహనాలు కార్లను రోడ్లపైనే పార్కింగ్ చేపడుతున్నారు.

దీంతో ఆ రహదారి వెంబడి రాకపోకలు సాగించే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉదయం సాయంత్రం వేళల్లో  షాపింగ్ మాల్ ముందు పార్క్ చేసిన వాహనాలతో నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా సం బంధిత ట్రాఫిక్ పోలీసులు  షాపింగ్‌మాల్ ముందు పార్కింగ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం..

క్రమం తప్పకుండా స్పెషల్ డ్రైవ్ చేపడుతు న్నాం. రెండు వా రాలుగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రై వ్ చేపడుతున్నాం.  ప్రజలకు ట్రాఫిక్ పోలీ సుల ఫోన్‌నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా షాపింగ్ మాల్ ముం దు పార్క్ చేస్తే ఫొటోస్ అక్కడి లొకేషన్ షేర్ చేయండి. తక్షణమే అక్కడికి ట్రా ఫిక్ సిబ్బంది చేరుకొని వాహనాలను  సీజ్ చేస్తారు. 

 జానయ్య, కేపీహెచ్‌బీ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్