calender_icon.png 11 January, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్ రావును కలిసిన ట్రిపుల్ఆర్ నిర్వాసితులు

07-12-2024 01:47:52 PM

హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావును ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు హైదరాబాద్ లో కలిశారు. ట్రిపుల్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని హరీశ్ రావుకి వివరించారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పి, నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిర్వహిస్తున్నారని, భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని బాధను వెలిబుచ్చారు. భూసేకరణ చట్టం అమలు చేయకుండా, తక్కువ ధరకే భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని వివరించారు. తమ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తాలని రైతులు హరీశ్ రావును కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.