22-04-2025 11:19:12 PM
భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఇంటర్ నందు 1000 మార్కులకు గాను బైపిసి విభాగం నుండి కోరాడ వినీష 990 రాష్ట్ర ప్రథమస్థాయి మార్కులతో చరిత్ర సృష్టించింది. అలాగే ఎంపీసీ విభాగం నుండి జె. నాగబాబు-981, కె.వంశీ-963, యం. రామలక్ష్మి-948, యాకూబ్ పాషా-910, కె. ప్రణీత్-909, మొహిద్దీన్-908, నవ్య-901 మార్కులు సాధించి కళాశాలకు వన్నె తెచ్చారు. అలాగే సిఈసి విభాగం నుండి ఆర్. పుష్పలత-928 మార్కులతో విజయఢంకా మ్రోగించారు. వీటితో పాటు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను, హరి సత్యశ్రీ-467, రమ్య-466, లహరి-466, రాధిక-462, అమృత వర్షిణి-458, మహేశ్వరి-457, హాసిని-452, అనూష-437, రాంచరణ్-436, నిఖిత-435, అశ్విత-422 అరవింద్-400 మార్కులు సాధించారు.
జూనియర్ బైపిసి విభాగం నుండి 440 మార్కులకు గానూ, యం.గాయత్రి-422, రంజిత్ కుమార్-406, శ్రీ ప్రతిమ-414, రుత్విక-402, సంగీత-402 మార్కులు సాధించారు. అదేవిధంగా సిఈసి విభాగం నుండి 500 మార్కులకు గానూ, మౌనిక-447, కావ్యశ్రీ-428, కల్పన-420 మార్కులతో అగ్ర స్థానాన నిలిచి ఫలితాలలో విజయపతాకం ఎగరవేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్లు గూడపాటి. వి.మహేశ్వర రావు, రేపల్లెమోహన్ సూర్యం, డేగల చైతన్య పాల్గొని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మిఠాయిలు తినిపించి అభినందించారు. అదేవిధంగా ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన అధ్యాపకుల కృషిని కూడా ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లతో పాటు, సీనియర్ అధ్యాపకులు రేపల్లె దివ్యశ్రీ, రవిచంద్రరావు, నిర్మల కుమారి, భవాని, మౌనిక, విద్యార్థుల తల్లిదండ్రులు సత్తిబాబు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.