calender_icon.png 23 December, 2024 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభివృద్ధికి ఆర్పీలు తోడ్పడాలి

06-10-2024 12:59:21 AM

రిసోర్స్‌పర్సన్స్ సమావేశంలో సంఘం అధ్యక్షురాలు సుభద్ర

గజ్వేల్, అక్టోబర్ 5: మున్సిపల్ రిసోర్స్ పర్సన్స్ (ఎంఆర్పీ) మహిళల అభివృద్ధికి తోడ్పడాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆర్పీల సంఘం అధ్యక్షురాలు సుభద్ర పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సుభద్ర మాట్లాడారు.

‘మెప్మాలో వసూల్ రాణు లు’ శీర్షికన ఈ నెల 3వ తేదీన విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి స్పం దనగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శనివారం ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేసి తగిన సూచనలు చేశారు. మహిళా సంఘం సభ్యులకు ఆర్థిక రుణాలు ఇప్పించి వారికి అవసరమైన సహకారం అం దించాలని సూచించారు.

సభ్యులు బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నప్పుడు అయ్యే స్టేషనరీ ఖర్చుల వివరాలను సభ్యులకు క్షుణ్ణంగా వివరించాలని తెలిపారు. కమీషన్ల వసూలుపై ఆరా తీయగా ప్రతి నెలా ఎంసీపీ, ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు చెల్లించాల్సి బకాయిలను మాత్రమే సభ్యులు ఇస్తారని ఆర్పీలు వెల్లడించినట్లు తెలిపారు. రికార్డులలో తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.