calender_icon.png 9 January, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన ఆర్పిఎల్ సంబరాలు..

08-01-2025 10:23:39 PM

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి చేతుల మీదుగా జెర్సీ ఆవిష్కరణ...

సీఐ వెంకటరాజా గౌడ్ చేతుల మీదుగా పోటీలు ప్రారంభం...

రామాయంపేట: ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరిగే రామాయంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. జొన్నల బాలు స్పాన్సర్ చేస్తున్న ఈ పోటీలు మంగళవారం రాత్రి సిద్దిపేట చౌరస్తాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా జెర్సీ, కప్పును ఆవిష్కరించారు. ప్రత్యేక విద్యుత్ దీపాల వెలుగులో, బాణాసంచా శబ్దాల మధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  హనుమంతరావు మాట్లాడుతూ.. కళాశాల మైదానం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఘనంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. బుధవారం రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్ చేతుల మీదుగా అర్పీల్ క్రీడా పోటీలు ప్రారంభించారు. స్నేహపూర్వక  వాతావరణంలో ఆటలు ఆడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు, నిర్వాహకులు బసన్నపల్లి మల్లేశం, ఉమా మహేష్, ఆర్కే మల్లేశం, సుభాష్ రాథోడ్, సంతోష్, ఆర్పిఎల్ టీంల ఓనర్స్ పుట్టి రాజు, రాంకీ, రాజేష్, విక్కీ, డాక్టర్ సతీష్, సృజన్, జమ్మూ, దోమకొండ శ్రీను, అలీం, ఏలీయా, సందీప్ రెడ్డి, సుజిత్ రెడ్డి, రోహిత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.