- నిరుద్యోగ సమస్యపై కేంద్రం ప్రత్యేక దృష్టి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ‘రోజ్‌గార్ మేళా’ ని ర్వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అ న్నారు. నిరుద్యోగ సమస్యపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్ట్రియల్ అకాడమీలోని అంతరిక్ష కేంద్రం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన రోజ్ గార్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి వందలాది అభ్యర్థులకు నియా మక పత్రాలు అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. 2022 అక్టోబర్ 22న రోజ్ గార్ మేళా ప్రారంభమైందని, ఇప్పటివరకు 8.54లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని..
తాజాగా భర్తీ చేసిన 71 వేల కొలువులతో 9.25 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వేలాది నిరుద్యోగులు ఏళ్లుగా పోటీ పరీక్ష లకు సిద్ధమవుతున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల కారణంగా, మిగతా ఉద్యోగులపై భారం పడుతోందన్నారు.
తద్వారా ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం నియామక పత్రాలు అందుకు న్న 71వేల మంది చిత్తశుద్ధితో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు సంబంధం లేని అంశాల జోలికి వెళ్లి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎస్‌ఏ డైరెక్టర్ సునీల్ ఇమ్మానుయేల్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసబాబు అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.