అడ్డుకోబోయిన వారిపైనా దౌర్జన్యం
రాజేంద్రనగర్, ఆగస్టు 7: ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. తన అరాచకాలు వెలుగులోకి తీసుకొచ్చాడని కక్షగట్టిన అతడు ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై దాడి చేశా డు. అడ్డుకోబోయిన వారిపైనా దౌర్జ న్యం చేశాడు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ముబీన్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన స్థానికంగా నివాసం ఉండే రౌడీషీటర్ సోహెల్ అరాచకాలపై వార్తలు ప్రసారం చేశాడు.
సంబం ధిత లింకులు ఛానల్ నుంచి తొలగించకపోతే చంపేస్తానని ముబీన్‌ను రౌడీషీటర్ బెదిరించసాగాడు. అయినా కూడా తొలగించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ముబీన్ వట్టెపల్లి మైమూద హోటల్ సమీపంలో ఉండగా సోహెల్ తన అనుచరులతో వచ్చి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన వారిపైనా దౌర్జన్యం చేశాడు. తీవ్రంగా గాయపడిన ముబీన్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సోహెల్ కోసం గాలిస్తున్నారు.