calender_icon.png 26 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 మంది రౌడీషీటర్లు అరెస్ట్

22-07-2024 01:50:53 AM

అత్తాపూర్‌లో స్థలం కబ్జా చేసేందుకు యత్నం

కత్తులు, ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటీ పోలీసులు

ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్లు అనుమానం 

రాజేంద్రనగర్, జూలై 21: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్బర్ హిల్స్‌లో కోట్ల విలువ చేసే స్థలం కబ్జాకు గురైంది. కబ్జాకు యత్నించిన తొమ్మిది మంది రౌడీ గ్యాంగ్‌ను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, అత్తాపూర్ పీఎస్ పరిధిలోని అక్బర్‌హిల్స్‌లో 500 గజాల ఖాళీ స్థలం ఉంది. దీనిపై తొమ్మిది మంది రౌడీ ముఠా కన్ను పడింది. ఆదివారం ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు.

విశ్వసనీయ సమాచారంతో అత్తాపూర్ పోలీసు లు, ఎస్‌ఓటీ టీం ఆకస్మికంగా దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి నాలుగు కత్తులు, ఒక ఎయిర్ పిస్టల్, ఒక గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి హుక్కాకు సంబంధించిన సామగ్రి కూడా పట్టుకున్నా రు. ఎవరైనా స్థలం వద్దకు వస్తే కుక్కలతో దాడి చేయించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్మా ర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ వ్యవహారం వెనుక ఈ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్లాట్లు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆకస్మిక దాడుల్లో ఏసీపీ శ్రీనివాస్, అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.