calender_icon.png 1 November, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోయిన రౌడీ షీటర్ యూసుఫ్ గ్యాంగ్

11-08-2024 10:39:27 AM

ఓ కుటుంబంపై కత్తులు, కర్రలతో దాడి 

నలుగురు మహిళలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు  

రాజేంద్రనగర్: రౌడీ షీటర్ యూసుఫ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్ వద్ద ఓ కుటుంబంపై దాడి చేసింది. కత్తి, కర్రలతో కుటుంబంపై పాశవికంగా దాడి చేయడంతో నలుగురు మహిళలతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లిన అకారణంగా రౌడీ షీటర్ గ్యాంగ్ దాడి చేశారంటున్న కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.