14-04-2025 11:08:43 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఓల్డ్ సిటీలో దారుణ హత్య జరిగింది. ఫలక్నుమా పరిధిలోని రెయిన్ బజార్ లో రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మాస్ యుద్ధీన్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రత్యర్థులే యుద్ధీన్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు రోజుల క్రితమే రౌడీ షీటర్ మాస్ యుద్ధీన్ కి వివాహం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.