calender_icon.png 10 March, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీ జనార్దన.. ఫిక్షనల్ క్యారెక్టర్‌కు బయోపిక్!

07-03-2025 12:00:00 AM

విజయ్ దేవరకొండ అభిమానులకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే ‘కింగ్‌డమ్’తో ట్రెండింగ్‌లో ఉన్న  విజయ్.. ఆ ప్రాజెక్టు తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా నిర్మాత దిల్ రాజు.. ఇటీవలి ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా టైటిల్ లీక్ ఇచ్చారు.

ఈ సినిమా టైటిల్ ‘రౌడీ జనార్దన’ అని చెప్పేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా టైటిల్ చూస్తే.. రియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. రవికిరణ్ కోలా ఇప్పటికే స్క్రిప్ట్‌పై పూర్తి గ్రిప్ సాధించారనే విషయం ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది. ‘ఓ ఫిక్షనల్ క్యారెక్టర్‌కు బయోపిక్ ఉంటే ఎలా ఉంటుందో అదే నా తర్వాతి సినిమా’ అనే మాటల వెనకున్న అర్థం విజయ్ దేవరకొండ సినిమా గురించేనని అర్థమవుతోంది.

దర్శకుడు దీన్ని ఓ ఎపిక్ మాస్ యాక్షన్‌గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గతంలో రివీల్ చేసిన పోస్టర్‌పై ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..’ అనే వ్యాఖ్య ఆలోచింపజేసింది. ఇంకో విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ ఇందులో రాయలసీమ, గోదావరి యాసల్లో మాట్లాడతారట. మే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.