calender_icon.png 25 October, 2024 | 2:44 AM

వచ్చే మార్చిలో రౌడీ హీరో ఆగమనం

03-08-2024 12:05:00 AM

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ‘వీడీ12’ను విడుదల చేస్తున్నామని నిర్మాత శుక్రవారం ప్రక టించారు. ‘ఏడేళ్లుగా గౌతమ్ తిన్ననూరితో వర్క్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఆయనపై నమ్మకంతో చెప్తున్నా.. ఈసారి మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండను పవర్‌ఫుల్ పాత్రలో చూడబోతున్నారు. 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఇదే నెలలో ప్రకటిస్తాం’ అని నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అని రుధ్ రవి చందర్; కెమెరా: గిరీశ్ గంగాధరన్, జోమోన్ జాన్.