పెద్ద పెద్ద ఫ్రిడ్జుల్లో కుళ్లిన మాంసం, పాడైన ఆహార పదార్థాల నిల్వ.. పాకురు పట్టిన కిచెన్లు.. ఎక్కడ వేసిన చెత్త అన్న చందంగా పరిసరాలు.. ముక్కు పుటాలదిరేలా దుర్గంధం.. ఇవీ కోరుట్ల మున్సిపాలిటీ లో మున్సిపల్ అధికారులకు ఎదురైన అనుభవం. మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సోమవారం కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అధికారు లు ఫ్రిడ్జ్‌ల్లో నిల ఉంచిన ఆహారం, కుళ్లిన ఆహార పదార్థాలను సాధీనం చేసుకున్నారు. అనంతరం డంపింగ్ యార్డ్‌లో గుంత తీసి పూడ్చి వేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్ యాజమాన్యాల కు మొత్తం రూ.32 వేల వరకు జరిమానా విధించారు.