calender_icon.png 12 March, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కు సన్మానం

12-03-2025 05:00:36 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా డాక్టర్ జైపాల్ రెడ్డి నియామకమైన సందర్భంగా బుధవారం సన్మానించారు. కామారెడ్డి రక్తదాతల సమూహం ప్రతినిధులు ఆర్కే విద్యా సంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డిని కామారెడ్డి రక్తదాతల సమూహం ఫౌండర్, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు(IVF Seva Dal State Chairman Dr. Balu), కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకే మొట్టమొదటిసారిగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా డాక్టర్ జైపాల్ రెడ్డి నియామకం అభినందనీయమని,వేసవి కాలాన్ని దృష్ట్యా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను,మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను రోటరీ క్లబ్ ల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా రక్త దాతల సమూహం ప్రతినిధుల కు కృతజ్ఞతలు తెలిపారు.