calender_icon.png 16 March, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్

14-03-2025 12:00:00 AM

ప్రముఖ నటుడు శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి’ వంటి చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంచి స్క్రిప్ట్‌ని ఎం చుకుని ‘ఛాంపియన్’ చిత్రంలో నటిస్తున్నాడు. గురువారం రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌ని బట్టి చూస్తే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. గ్లింప్స్ రోషన్‌ను స్ట్రాంగ్ విల్ పవర్‌తో ఉన్న ఇంటెన్స్ ఫుట్‌బాల్ ఆటగాడిగా పరిచయం చేస్తుంది. ఈ పిరియాడిక్ డ్రామాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.