అసెంబ్లీ నుంచి నేరుగా పయనం
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): నేటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా వెళ్లి.. సాయంత్రం కరీంనగర్ ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. రాత్రి రామగుండంలో బస చేసి.. 26న 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ వద్దకు చేరుకోనున్నారు. 11 గంటలకు మేడిగడ్డ వద్ద పరిశీలించి తిరిగి రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.