calender_icon.png 12 January, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో కాంగ్రెస్‌లోకి గులాబీ ఎమ్మెల్యేలు

12-10-2024 01:52:47 AM

జిల్లాల సమీక్ష తర్వాతే కొత్త కార్యవర్గం 

ఎన్నికల కారణంగానే నామినేటెడ్ ఆలస్యం 

సురేఖను మంత్రివర్గం  నుంచి తప్పించబోం

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ వెల్లడి   

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): త్వరలోనే మరికొంత మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు.

శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకోవడం వల్లే కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు తగ్గాయని, లేదంటే 13 సీట్లు వచ్చేవని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి లిక్కర్ కేసే ఉదాహరణ అని, ఆ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు.

శాంతిభద్రతలే ముఖ్యం..

కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అంటుంటే  తమ ప్రభుత్వానికి ఎంఐఎం అండగా నిలిచిందని, ఎంఐఎంతో స్నేహపూర్వక సంబం ధం ఉందన్నారు.  నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఫిరోజ్‌ఖాన్, ఎంఐఎం ఎమ్మెల్యే వివాదంపై స్పందిస్తూ శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించే దని స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు, పర్యటనల తర్వాత కొత్త కార్యవర్గ కూర్పు ఉంటుందని చెప్పారు. హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల కారణంగా నామినేటెడ్  పోస్టుల నియామ కం ఆలస్యమైందన్నారు. తీన్మార్ మల్ల న్న బీసీల విషయంలో ఆయనకున్న ఆలోచనలు మాత్రమే చెబుతున్నారని, రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు బీసీ కులగణన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

విద్య, వైద్యంతో పాటు స్పోర్ట్స్‌ను కూడా తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.  

మూసీ ప్రక్షాళనా చేయాలా? వద్దా?

కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఉండి హైడ్రా విషయంలో బాధ్యాతరహితంగా మాట్లాడితే ఎలా అని ఆయన నిలదీశారు.మూసీ ప్రక్షాళన చేయాలా? వద్దా అనేది చెప్పాలని కోరారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ వేర్వేరని, వయనాడ్, దుబాయ్‌లో వచ్చిన పరిస్థితులు మన వద్ద రాకూడదనే మూసీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

హైడ్రా విషయంలో కేటీఆర్ దరఖాస్తులు తీసుకున్నా బాధితులకు ప్రభుత్వ మే న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీపై చర్చకు రావాలని తాను చేసిన సవాల్‌కు హరీశ్‌రావు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.