calender_icon.png 25 January, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.30 కోట్లతో రోప్‌వే నిర్మాణం

25-01-2025 01:05:16 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

ఖమ్మం, జనవరి 24 (విజయక్రాంతి): ఖమ్మం నగరానికి మరోసారి వరద ముప్పు రాకుండా ఉండేందుకు రూ.249 కోట్లతో చేపట్టిన డ్రైయిన్ పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం రోప్‌వే పనులు రూ.30 కోట్లతో చేపట్టామని, వీటికి త్వరగా టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని అన్నారు.

శుక్రవారం మంత్రి తుమ్మల ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 8వ డివిజన్‌లోని బల్లేపల్లి నుంచి బాలపేట వరకు రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. స్టాటర్ హౌస్  నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, దీనికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, పనులు ప్రారంభించాలని కమిషనర్‌కు సూచించారు.

సర్ధార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం వసతుల కల్పనకు గణతంత్ర దినోత్సవం నాడు శంకుస్థాపన చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ నీరజ, ఆర్డీవో నరసింహారావు పాల్గొన్నారు.