24-03-2025 01:40:19 AM
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు
నల్లగొండ, మార్చి 23 (విజయక్రాంతి): నల్లగొండ పట్టణానికి చెందిన దుబ్బ రూప మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్‌కు సంబంధించి అత్యధిక సభ్యత్వాలు చేయించడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతరావు ఆమెను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా దుబ్బ రూప మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా మహిళా కాంగ్రెస్ తరఫున కృషి చేస్తానని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను పటిష్ఠపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావుకి ధన్యవాదాలు తెలిపారు.