calender_icon.png 28 September, 2024 | 2:54 AM

రూహ్ బాబా వస్తున్నాడు!

28-09-2024 12:51:25 AM

కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న తాజా హారర్ -కామెడీ ‘భూల్ భులయ్యా 3’. రూహ్ బాబా పాత్రలో కార్తీక్ మరోమారు మెప్పించనున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ తాజాగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. త్రిప్తి డిమ్రీ, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ కూడా భాగం కానుందని వార్తలొస్తున్నాయి.

బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ ఉన్న హారర్ కామెడీ ప్రాంఛైజీ ‘భూల్ భూలైయా’ మొదటి రెండు భాగాలు ప్రేక్షకాదరణ పొందాయి. అనీస్ బజ్మీ దర్శకత్వంలో మరోసారి భయపెడుతూ కామెడీ పండించేందుకు వస్తున్నదే ‘భూల్ భూలైయా-3’. మూడో భాగంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ తమ నటనతో అదరగొట్టనున్నారనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెబుతోంది