calender_icon.png 19 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ కు క్యాట్ ఊరట

09-04-2025 07:22:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ కు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(Central Administrative Tribunal)లో ఊరట లభించింది. రోనాల్డ్ రాస్ తన సేవను  తెలంగాణలో కొనసాగించడానికి అనుమతిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఆయన పోస్టింగ్‌ను కొనసాగించాలని క్యాట్ సిబ్బంది, శిక్షణ శాఖ (DOPT)ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రోనాల్డ్ రాస్‌ను మొదట డీవోపీటీ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. 

అయితే క్యాట్ ని సంప్రదించడం ద్వారా అతను గత దశాబ్దం పాటు తెలంగాణలోనే విధులు నిర్వహించారు. గత ఏడాది రాస్ సహా అనేక మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను అనుసరించి రొనాల్డ్ రాస్ ఏపీలో తన కొత్త నియామకానికి రిపోర్ట్ చేశాడు.  తెలంగాణలో తన సేవను కొనసాగించడానికి అనుమతి కోరుతూ ఆయన మళ్ళీ క్యాట్ ను ఆశ్రయించాడు. రోనాల్డ్ రాస్ పిటిషన్ పై విచారించిన క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

మరోవైపు ఐఏఎస్ అధికారి శివశంకర్ క్యాట్ లో కంటెంప్ట్ పిటిషన్ దాఖాలు చేశారు. క్యాట్ ఆదేశాలను డీవోపీటీ అమలు చేయడం లేదని పిటిషన్ వేశారు. శివశంకర్ ను ఆంధ్రప్రదేశ్ కే కేటాయించాల్సిందిగా డీవోపీటీని క్యాట్ ఫిబ్రవరి 28వ తేదీన ఆదేశించింది. అయిన డీవోపీటీ ఉత్తర్వులను అమలు చేయకపోయవడంతో శివశంకర్ మరోసారి క్యాట్ ఆశ్రహించారు. దీంతో ఉత్తర్వులను అమలు చేయడానికి గడువు కావాలని డీవోపీటీ కోరింది. నాలుగు వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలన్ని క్యాట్ సూచించింది.