calender_icon.png 30 October, 2024 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాంటిక్ మెలోడీ... కిసీ రోజ్

30-06-2024 12:05:00 AM

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్, సీనియర్ నటి టబు కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరోన్ మే కహన్ దమ్ థా’. నీరజ్ పాండే కథను అందిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్‌హెచ్ స్టూడియోస్ సమర్పణలో ఏ ఫ్రైడ్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నరేంద్ర హీరావత్, కుమార్ మంగత్ పాఠక్, సంగీత అహీర్, శీతల్ భాటియా నిర్మిస్తున్నారు. దీంట్లో శాంతను మహేశ్వరి, జిమ్మీ, షేర్గిల్, బెనెడిక్ట్ గర్రెట్, సయీ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

2000 మధ్య కాలంలో సాగే రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా జూలై 5న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇటీలలే ట్రైలర్ రిలీజ్ కాగా, తాజాగా శనివారం ‘కిసీ రోజ్’ అనే ఓ రొమాంటిక్ మెలోడీని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి కూర్చిన స్వరాలు, మనోజ్ ముంతాషిర్ అందించిన సాహిత్యం, మైథిలీ ఠాకూర్ గానం సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.