calender_icon.png 1 February, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంహారం

30-01-2025 12:00:00 AM

సీనియర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ధర్మ ‘సంహారం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో దాసరి, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరుల వద్ద వందకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన ధర్మ.. ఈ సినిమా కోసం మెగాఫోన్ పట్టారు. రత్న మేఘన క్రియేషన్స్ పతాకంపై ధర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

ఆదిత్య, కవిత మహతో హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ.. ‘గురువు దాసరి కాంపౌండ్‌లో పనిచేస్తూ, చిత్ర పరిశ్రమలోని ఆటుపోట్లను అవహగాన చేసుకున్న టెక్నీషియన్ ధర్మ..

ఈ చిత్రం ద్వారా దర్శక నిర్మాతగా మారడం అభినందనీయం’ అన్నారు. దర్శక నిర్మాత ధర్మ మాట్లాదుతూ.. ‘రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఒక అమ్మాయి తనను, తన అక్కను దుష్టులను ఎలా ఎదుర్కొందన్న పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. తమను తాము కాపాడుకునేందుకు అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ అత్యంత ఆవశ్యకమని ఈ చిత్రంలో చూపించాం’ అని చెప్పారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు, విలన్‌గా నటించిన సాకేత్ సాయిరాం మాట్లాడుతూ.. ‘విలన్ పాత్ర నాకు పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఇంకా ఛాయాగ్రాహకుడు శ్రీనివాస్ శ్రీరాముల, గాయనీగాయకులు రవివర్మ, హరి, మానస ఆచార్య తదితరులు చిత్రం గురించి తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు.