డా. కోలాహలం రామ్‌కిశోర్ :
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ తన సిద్ధాంతా న్ని, ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదాన్ని లేవనె త్తింది. దాంతోపాటు భూస్వాములకు, ప్ర భుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రం చేసింది. ముఖ్యంగా కౌలుదారులు వారు సేద్యం చేస్తున్న భూములను ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే, భూ ములను పేదరైతులకు, రైతుకూలీలకు పం చిపెట్టింది. ఇలాంటి పూర్తిస్థాయి సాయుధ విప్లవానికి జాతీయ, రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు మనస్ఫూర్తిగా మద్ద తు ఇవ్వలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ సంస్కరణల విషయంలో అనుకూ లంగానే ఉంది.
ఫలితంగా, కాంగ్రెస్ మొద ట్లో నిజాం రాజుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పని చేసింది. కానీ, 1945 ఆ గస్టు 15 తర్వాత కమ్యూనిస్టు ఉద్యమ తీవ్రతను గ్రహించి తన మద్దతును ఉపసంహ రించుని మధ్యలో ఒంటరిగా వదిలేసింది. అయినా, ఈ వేర్పాటువాద విధానాన్ని ల క్ష్య పెట్టకుండా కమ్యూనిస్టులు ప్రజల స హాయ సహకారాలతో ముందుకు సాగా రు. ఈ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సాయుధ దళాల బలగా న్నీ, బలాన్ని మరింత పెంచుకొంది. క మ్యూనిస్టులు ఒంటరిగా నూతన ఉత్సాహంతో సాయుధ పోరాటాన్ని ముందుకే నడిపించారు. ఈ మహోద్యమంలో మహిళల పాత్ర విస్మరించలేనిది.
మొదటి వీరనారి రాములమ్మ
--1946-- సంవత్సరాల నాటి తెలంగా ణ సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీల పాత్ర అమోఘమైంది. ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమమూ స్త్రీల సహాయ, సహకారా లు లేకుండా విజయవంతం కాలేదు. ఈ సాయుధ పోరాటంలో నిరక్షరాస్యులైన పే ద ప్రజల నుంచి ఉన్నత విద్యావంతులైన స్త్రీల వరకు అనేకులు పాల్గొనడం ఒక వర్గ సంస్కృతికి నిదర్శనంగా భావించవచ్చు. ముఖ్యంగా గిరిజన, కోయ, చెంచు స్త్రీలు తమ అమూల్యమైన మద్దతును సాయిధ గెరిల్లా దళాలకు, ముఖ్యంగా కమ్యూనిస్టు విప్లవకారులకు ఇవ్వడం అనేది ఒక చారిత్రక అంశం.
ఎందరో స్త్రీలు తమ ప్రాణాల ను ఈ ఉద్యమం కోసం త్యాగం చేశారు. వారిలో మొదటి మహిళ నల్లగొండ తాలూకాలో మంగళపల్లి గ్రామానికి చెంది న 11 ఏళ్ల రాములమ్మ. నిజాం పోలీసులు, రజాకారులు పెట్టిన చిత్రహింసలవల్ల మరణించింది. ఈ తరహాలోనే స్త్రీలు అనేకమం ది ఉద్యమంలో పాల్గొని తమ వంతు కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించి తెలం గాణ విముక్తిని సాధించారు.
ఈ పోరాటంలో పాల్గొన్న మహిళల్లో ప్రమీలాతా యి, భద్రమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, కామ్రేడ్ రంగమ్మ, దామ ఎల్ల మ్మ, కర్రి బుచ్చమ్మ, మంగటి అక్కయ్య, గుజ్జా రామమ్మ, కర్రి శాంతమ్మ, బ్రిజ్‌రాణి గౌరమ్మ, రావి సత్యవతి, చిట్యాల ఐలమ్మ, నల్ల వజ్రమ్మ, దూడల సాలమ్మ, పుట్నాల రామక్క, జాటోత్ మంగ్లీ, ఫూల్‌బాయి, ల చ్చక్క, కోయ పాపక్క, నాగమ్మ, రామక్క, పుల్లక్క, అడివమ్మ, నారాయణమ్మ, కోయ వెంకటమ్మ, భూదెమ్మ వంటి వారెందరో ఉన్నారు.
రజాకార్లపై ఎదురు దాడులు
ఈ సాయుధ పోరాట కాలంలో (1947 ఏప్రిల్ - మార్చి మధ్య) రజాకార్లు సుమారు 2,500 గ్రామాలను దోచుకున్నారు.
అంతేకాక 4,000 ఇళ్లను తగులబెట్టా రు. 500 మందిని బలిగొన్నారు. చాలామందిని తీవ్రంగా గాయపరిచారు. వంద లాది స్త్రీలను చెరిచారు. దీనికి ప్రతీకారం గా కమ్యూనిస్టులు ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారం 1946 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 13 వరకు 2,000 మందిని కిరాతకంగా హతమార్చారు. 22 పోలీస్ ఔట్ పోస్టులపై దాడి చేశారు. గ్రామ రెవెన్యూ రికార్డులను దగ్ధం చేశారు. చాలామంది గ్రామాధికారులపై చేయి చేసుకున్నారు. చావిడీలను, గడీలను, కస్టమ్స్ ఔట్ పోస్టులను తగులబెట్టారు. 230కి పైగా తుపాకు లను స్వాధీనం చేసుకున్నారు.
వరి ధాన్యాలను దోచుకున్నారు. పది లక్షల రూపా యలకంటే ఎక్కువ విలువైన నగలను, డబ్బును వశపరచుకోవటమేకాక కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగించారు. రవాణా లైన్లను, పంపిణీ వ్యవస్థను ధ్వం సం చేశారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ నిలకడగా, చాలా పకడ్బందీగా గెరిల్లా యు ద్ధపద్ధతుల్లో వ్యూహాలను ఎంచుకొన్నారు. ఉద్యమానికి బయలుదేరే ముందు వారికి అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆయుధాలను, వనరులను సమర్థవంతంగా వా డుకుంటూ, దాడులను విజయవంతంగా నిర్వహించారు.
భూసంస్కరణల కోసం కమిటీ
1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యకు పూ నుకుంది. ఫలితంగా వారం రోజుల్లో ని జాం సైన్యం, పోలీసులు, రజాకార్లు ఏ మా త్రం ప్రతిఘటించకుండానే భారత సైన్యానికి లొంగిపోయారు. ఈ పోలీసు చర్య రజాకార్లు, నిజాం ప్రభువుకు వ్యతిరేకతతోపాటు కమ్యూనిస్టుల ఏరివేత, ఉద్యమం అణిచివేత చర్యకు కూడా పాల్పడింది. ఫలితంగా వేలాదిమంది కమ్యూనిస్టులు హతమయ్యారు. అనేకులు అరెస్టు కావటమేకా క మిలిటరీ క్యాంపుల్లో బంధీలయ్యారు. ముఖ్యంగా రైతులపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికిగాను 1949 ఆగస్టులో జాగీర్దారీ విధానం రద్దు చట్టం ద్వారా ఆ వ్యవస్థను తొలగించారు. దాంతోపాటు భూసంస్కరణల కోసం వ్యవసాయ కూలీ ల ఎంక్వయిరీ కమిటీని నియమించారు.
స్వచ్ఛంద విరమణ
-ఉద్యమంపై ప్రభుత్వం అణచివేత, నిర్బంధం పెరిగింది. ప్రజలు తమ మద్దతును ఉపసంహరించుకొన్నారు. అందువ ల్ల కమ్యూనిస్టు పార్టీకి పోరాటాన్ని కొనసాగించడం అసాధ్యమైంది. ఈ దశలోనే కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రా జేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి తదితరులతో పుచ్చలపల్లి సుందరయ్య, మాకి నేని బసవ పున్నయ్య, దేవునిపల్లి వెంకటేశ్వరరావు వంటి వారు సాయుధ పోరాటా న్ని కొనసాగించాలన్నారు. సాయుధ పో రాట స్వభావం, అవలంబించిన వ్యూహా లు తదితర అంశాలపై తీవ్రంగా విభేదించారు.
పోలీసు చర్య తర్వాత, ధనిక రైతు లు చాలామంది సాయుధ పోరాటాన్ని వదిలివేయగా, కేవలం పేద రైతులు, వ్యవసాయ కూలీలు, గిరిజన ప్రజలు, మరి కొద్దిమంది మధ్యతరగతి ప్రజలతో సాయుధ పోరాటాన్ని కొనసాగించవలసి వచ్చింది. దీనికితోడు తెలంగాణ నాయకుల మధ్య చీలిక ఏర్పడింది. ప్రముఖుడైన రావి నారాయణరెడ్డి తనకు తాను విప్లవాత్మకమైన సాయుధ పోరాటం నుంచి పక్కకు తప్పుకొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విమర్శించారు. ఈ కారణలన్నింటివల్ల 1951 అక్టోబర్ 21న కమ్మూనిస్టు పార్టీ అయిష్టంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్వచ్ఛందంగా విరమించింది. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో పాల్గొంది. ఆంధ్ర, తెలంగాణ రెండింటిలోనూ మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. అంతేగాక, రావి నారాయణరెడ్డికి జవహర్‌లాల్ నెహ్రూకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీనిని కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాల ఘన విజయంగా భావించాలి.
పర్యవసానాలు, ఫలితాలు
--ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే ఇది భారత కమ్యూనిస్టుల మొదటి అతిపెద్ద రైతాంగ సాయుధ పోరాటం. ఇది సుమారు 16 వేల చ.మై. విస్తీర్ణంలో సుమారు 3,000 గ్రామాలకు విస్తరించింది. ఒక అంచనా ప్రకారం నిజాం నిరంకుశ, భూస్వామిక పాలనను తుదముట్టించి, వ్యవసాయ కా ర్యక్రమాలను చేపట్టి లక్ష ఎకరాల భూమిని తిరిగి పంపిణీ చేయడం జరిగింది. వెట్టిచాకిరీ విధానంతోపాటు చట్ట వ్యతిరేక ముడుపులు, వసూళ్లు, భూస్వామ్య విధానపు రకరకాల అణచివేతలు అంతమైనా యి.
తెలంగాణలోని ప్రతి పల్లెలో కొంతమేరకు సామాజిక సమానత్వం సాధ్యమైం ది. ఉచితంగా పని చేయించుకుని వెళ్లగొట్టడం అనేది నిషేధితమైంది. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ రేటు ఖరారైంది. యువతరంలో ప్రశ్నించే స్థాయిని, పని చేసే మానసిక స్ఫూర్తిని అందించింది. ప్రధానంగా ఈ సాయుధ పోరాటం ‘వ్యవసాయక విప్లవం’ అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది. భారతదేశంలో ఆ తర్వాత జరిగిన రైతాంగ పోరాటాలకు సైద్ధాంతిక పునాదులను నిర్మించింది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో భూసంస్కరణలు చేపట్టాల్సి వచ్చింది.
వ్యాసకర్త సెల్: 9849328496