ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అజీజ్
మంచిర్యాల,(విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో భాగంగా నిర్వహించిన వేడుకలలో ఎంఈఓ జాడి పోచయ్యతో కలిసి మాట్లాడారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధిగా ఉంటూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మార్పు చెందాలన్నారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, సంయుక్త కార్యదర్శి పెట్టం మల్లయ్య, పట్టణ ట్రస్మా అధ్యక్షుడు జుల్పీకర్, ప్రధాన కార్యదర్శి కుమార్, కోశాధికారి మమత, ఉపాధ్యక్షుడు తిరుపతి, నాయకులు దేవన్న, జోబిన్, శ్యాంసుందర్ రెడ్డి, ఉపేందర్, రామకృష్ణా రెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, రాజ్ కుమార్ వివిద పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.