calender_icon.png 19 April, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోల్ మోడల్ భూభారతి

18-04-2025 12:15:10 AM

  1. సామాన్య ప్రజలకూ అర్థమయ్యేలా పోర్టల్
  2. ధరణి చట్టాన్ని గంగలో కలిపాం
  3. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
  4. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నారాయణపేట/వికారాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తాము తెచ్చిన భూభారతి చట్టం దేశంలో రోల్ మోడల్‌గా నిలుస్తోందని రెవెన్యూ, హౌసింగ్, పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మేధావులతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించామన్నారు.

భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఖాజీ పూర్ గ్రామం, వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో  గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టాన్ని గం గలో కలిపామని వ్యాఖ్యానించారు.

భూ భారతి రైతు భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని, సామాన్య ప్రజల కూ అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుందని చెప్పారు. తమ భూముల సమస్యలు ధర ణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలే అసెంబ్లీలో తన తో అన్నారని, కానీ వారే శాసనసభలో భూభారతి చట్టానికి ఆమోదం తెలపకుం డా అడ్డుపడ్డారని విమర్శించారు.

ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. రైతుకు, భూమికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చట్టం ధృడం చేస్తుందన్నారు. గత ప్ర భుత్వం ధరణితో వేలాది ఎకరాలను కొల్లకొడితే, భూ భారతి ద్వారా అర్హులైన  పేదలకు భూములు పంచాలనే ఆలోచన తమ ప్రజా ప్రభుత్వానిది అన్నారు.

అసై న్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామన్నారు. కోర్టులో లేని ప్రతి భూ సమ స్యను పరిష్కరించడమే భూభారతి ము ఖ్య ఉద్దేశమన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఏర్పాటుచేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్‌పై సర్వే యర్ సంతకంతో కంప్యూటర్‌లో నమో దు చేస్తామని చెప్పారు.

మొదటగా 4 మండలాలను పైలెట్‌గా తీసుకున్నామని, మే 1 నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాలకు జిల్లా కలెక్టర్లు వెళ్లి  ఈ చట్టం గురిం చి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. జూన్ 2 లోగా ఎంపిక చేసిన నాలుగు పైలెట్ గ్రామాల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.

ఖాజీపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, పరిగి ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, డాక్టర్ వాకిటి శ్రీహరి, డాక్టర్ చి ట్టెం పర్ణికారెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాం గ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కు మార్ రెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పూ డూరులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, విప్ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రా మ్మోహన్‌రెడ్డి, బయ్యాని మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ పాల్గొన్నారు.