రోహిత్ శర్మ తన బ్యాటింగ్ ఫామ్ బాగా లేనందున సిడ్నీ టెస్ట్ నుండి తప్పుకున్నాడు. అంతేకానీ తాను రిటైర్ అవ్వలేదన్నారు. 2వ రోజు సిడ్నీలో లంచ్-టైమ్ షో సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో ఫ్రీవీలింగ్ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, సిడ్నీ నుండి బయట కూర్చోవాలని తాను తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైనదని, టీం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నేను ఫాంలో లేనని కోచ్ గంభీర్‌కి చెప్పానన్న రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లో రావడానికి కష్టపడుతున్నాను.. కానీ సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. అందుకే సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకున్నానని వివరణ ఇచ్చాడు. ఇది కఠినమైన నిర్ణయం తెలిపారు. జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) నాయకత్వం బాగుందని రోహిత్ శర్మ ప్రశంసించారు. “నేను మీకు చెప్పినట్లుగా ఈ నిర్ణయం రిటైర్మెంట్ నిర్ణయం కాదు లేదా నేను ఆట నుండి తప్పుకుంటాను, అలాంటి నిర్ణయం ఏమీ లేదు. బ్యాట్ నహీ చల్ రహా హై అని నేను ఆటకు దూరంగా ఉన్నాను'' అని రోహిత్ చెప్పాడు.